తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటింపు.
తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటింపు. జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.పండుగ అనంతరం 17వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులను విద్యార్థులు ఆనందంగా, సురక్షితంగా గడపాలని విద్యాశాఖ సూచించింది.