janamvoice.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:59 pm Digital Edition : GATTU MAHESH

మహిళలకు,హమాలి కార్మికులకు చీరలు,తూవాలలు పంపిణీ చేసిన గొస్కుల సదయ్య.

మహిళలకు,హమాలి కార్మికులకు చీరలు,తూవాలలు పంపిణీ చేసిన గొస్కుల సదయ్య.

జనం వాయిస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గోస్కుల సదయ్య మహిళలకు, హమాలీ కార్మికులకు చీరలు,తూవాలలు  ఉచితంగా పంపిణీ చేశాడు.ఈ సందర్భంగా గోస్కుల సదయ్య మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి కదంబ పూర్  ఐకెపి  సెంటర్లలో పనిచేసే మహిళలకు, హమాలీ కార్మికులకు ఉచితంగా చీరలు తూవాలలు ప్రతి పసలు  పంపిణీ చేస్తున్నట్టు తెలిపాడు. ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని గ్రామస్తులంతా ఏకదాటిపై నిలిచి ఒకసారి ఛాన్స్  ఇవ్వాలని కోరారు. గత కాలం నుండి  గ్రామంలో ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ముందుండి సహాయం చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడిన గ్రామస్తులకు తనకు తోచినంత సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాబోయే రోజుల్లో గ్రామస్తులకు ఎలాంటి సమస్య వచ్చిన ప్రతి వ్యక్తికి తన వంతు  కృషి చేస్తానని తెలిపాడు.