ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి..!
జనం వాయిస్, ఖమ్మం జిల్లా డిసెంబర్14:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్ లో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు, ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా…ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు..ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, సర్పంచ్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.