గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.-ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. విద్యార్థులు కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. జనం వాయిస్,మంథని: గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు) ఆయన తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపాల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ రవి, బోధన, బోధనేతర బృందం ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా...