Date of Publish : 20 February 2026, 1:53 pmDigital Edition : JANAM VOICE
అంగన్వాడీ టీచర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.
అంగన్వాడీ టీచర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.
విద్యార్థిని అకారణంగా కొట్టిన సల్వాజీ రాణి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో ఘటన.
జనం వాయిస్, రాజన్న సిరిసిల్ల:
విద్యార్థిని అకారణంగా కొట్టిన అంగన్వాడీ టీచర్ పై ఎస్సి ఎస్టీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపురం గ్రామానికి చెందిన కొంపల్లి విద్వాంస్ (03) ని అంగన్ వాడి టీచర్ సల్వాజీ రాణి అకారణంగా కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు అంగన్ వాడి టీచర్ పై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఎస్సై కే.రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్ వాడి టీచర్ సల్వాజీ రాణి తన కుమారుడు విధ్వాంస్ ను అకారణంగా కొట్టిందని.. కొంపల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సాక్ష్యాలను పరిశీలించిన తరువాత అంగన్ వాడీ టీచర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.