నూతనమేనేజర్ ను సన్మానించిన రిలే ఏ సీఎం సెక్షన్ అధికారులు మరియు కార్మిక బృందం.
జనం వాయిస్, పెదపల్లి, జూన్ 16:
రామగుండం ఆర్జి 2 ఏరియా వకీల్ పల్లి గనికి నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ ను అధికారులు మరియు కార్మికులు శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రిలే ఏ అడిషనల్ మేనేజర్ మేక్కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వకీల్ పల్లి గనిలో మేనేజర్ గా విధులు నిర్వహించిన పాక రవికిరణ్ కొత్తగూడెంకు బదిలీపై వెళ్లడంతో తన స్థానంలో నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ మల్లేశం కు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఆపరేటర్ జగదీష్, షటిల్ కార్ ఆపరేటర్లు రాజు, సమ్మయ్య, ఓర్ మెన్ & సర్దార్ సందీప్, అనిల్, ఎలక్ట్రిషన్స్, ఫిట్టర్స్, సిఓపిలు మరియు జనరల్ అసిస్టెంట్స్ & జనరల్ అసిస్టెంట్స్ ట్రైనీ లు పాల్గొన్నారు.