janamvoice.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 9:06 am Digital Edition : JANAM VOICE

గుండెపోటు తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

గుండెపోటు తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

జనం వాయిస్, ముత్తారం :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మృతి చెందడంతో పార్టీ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముత్తారం మండల కేంద్రానికి చెందిన మల్యాల రాజయ్య శుక్రవారం ఉదయం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు.తాను గతంలో ఎంపిటిసి గా పని చేయగా ప్రస్తుతం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాజయ్య మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.