దుఃఖాన్ని దిగమింగుకొని సేవా కార్యక్రమాలు.
– రామిళ్ల దంపతుల సేవాభావం అభినందనీయం.
– కుమారుడి వర్ధంతి సందర్బంగా అమ్మ పరివార్ లో ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం.
జనం వాయిస్, గోదావరిఖని, మే 23:
కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోయిన గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం–మంగళ దంపతులు గత ఐదు సంవత్సరాలుగా వారి జ్ఞాపకార్థం సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శనివారం తమ కుమారుడు రామిళ్ల శైలేంద్రకుమార్ ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం చేసారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తీవ్ర విషాదాన్ని తట్టుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామిళ్ల దంపతుల సేవాభావం అభినందనీయమన్నారు. సమాజంలోని దాతలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని నిరాశ్రయులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిల్ల కుటుంబ సభ్యులు శైలజ, వైష్ణవి, వణుష్ణ, రాజేంద్రకుమార్, జ్యోతి, విశ్వజిత్, నిత్యసాయి, మహేంద్ర కుమార్, సుప్రియ, కృతిక్, రవీంద్రకుమార్, గురుపాదం, మిత్రులు మేజిక్ రాజా, మేజిక్ హరి, చంద్రపాల్, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు.
