టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కాచే శశిభూషణ్.
జనం వాయిస్,మంథని, నవంబర్ 4 :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కోఆర్డినేషన్ సభ్యుడిగా మంథని పట్టణానికి చెందిన శశి భూషణ్ కాచే ను నియమిస్తూ టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీని అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో మరోసారి కాచేశభూషణ్ కు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఈ కమిటీలు నా పేరు సిఫార్సు చేసిన ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఛైర్మన్ పి. రాజేష్ కుమార్, నియమించిన పిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. కాచే శశిభూషణ్ నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షణ వ్యక్తం చేశారు.