ఏపీ శాసనసభలో శివరాత్రి సందడి.
ఏపీ శాసనసభలో శివరాత్రి సందడి.ఒకే వేషధారణతో మహిళా ప్రజాప్రతినిధుల ఐక్యత.సభలో ఆధ్యాత్మిక వాతావరణం.డిప్యూటీ సీఎం అభినందనలు.జనం వాయిస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేళ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. సభలో రాజకీయ అంశాలపై వాడివేడి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రేపటి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, శాసనసభ్యులు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఒకే తరహా వస్త్రధారణతో సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహా శివరాత్రి సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ...