“లచ్చక్క ముద్దుల కోడుకు” షార్ట్ ఫీలిం రిలీజ్.
జనం వాయిస్, ముత్తారం:
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన యువకుడు కెక్కెర్ల విశ్వరామ్ రూపొందించిన లచ్చక్క ముద్దుల కొడుకు షార్ట్ ఫీలిం ను సోమవారం ఖమ్మంపల్లి గ్రామంలో రిలీజ్ చేశారు. షార్ట్ ఫిలింలో నటించిన నటీనటులతో కలిసి ప్రారంభించారు.యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వీడియో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ అధికంగా వ్యూస్ పెరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో చిత్ర నటులు లచ్చన్న, భాగ్య, రమాదేవి, విజ్జు, యాదగిరి, కెమెరామెన్ అజయ్, ప్రొడ్యూసర్ రాజు, డైరెక్టర్ & రైటర్ విశ్వ రామ్, లతో పాటు గ్రామస్తులు అల్లం కుమారస్వామి, ఓదెలు, కిరణ్, రాజేందర్, ప్రసాద్, రాజ్ కుమార్, లచ్చన్న, నరేష్, రాజు, సత్యనారాయణ గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.