janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 7:51 pm Digital Edition : GATTU MAHESH

181 మంది ఎన్నికల సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ.

181 మంది ఎన్నికల సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ.

-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

జనం వాయిస్, పెద్దపల్లి, డిసెంబర్-12:

మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు దూరంగా ఉన్న 181 మంది ఎన్నికల సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ డిసెంబర్ 10, 11 తేదీలలో విధులకు గైర్హాజరైన 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపిఓ లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.