పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ..మెదక్ జిల్లాలో సంచలన ఘటన.
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన. జనం వాయిస్, మెదక్,నవంబర్ 18: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు....