janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 1:20 pm Digital Edition : JANAM VOICE

విధుల్లో సింగరేణి కార్మికుడు నిద్ర..!!

విధుల్లో సింగరేణి కార్మికుడు నిద్ర..!!

నాన్న గుర్తింపు సంఘం నాయకుడనే ధీమా.

అధికారులు ఏలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

జనం వాయిస్, గోదావరిఖని జూన్ 17 :

సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఓ బొగ్గు బావి గని లోని కార్మికుడు మంచి గాఢ నిద్ర పోయాడు. ఉదయం విధులకు హాజరైన ఆ కార్మికుడు రూమ్ లో  ప్రశాంతంగా నిద్రమత్తులో  తూలుతున్నాడు. కార్మికుని తండ్రి ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకుడనే ధీమా కావచ్చు.. మంచి నిద్రలో ఉన్నాడు. విధుల్లో అలసత్వం చేసినప్పటికీ నన్నేవరు ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సాధారణ కార్మికుడు అయితే చిన్న పొరపాటుకే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. అదే మరి గుర్తింపు సంఘం నాయకుడి కుమారుని సైతం విధుల్లో చేసే నిర్లక్ష్యాన్ని సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంటుందా… లేకుంటే హోదా ఉన్న వ్యక్తి కుమారుడని సానుభూతి ప్రదర్శిస్తుందో వేచి చూడాల్సి ఉంది. సింగరేణి సంస్థను నమ్ముకున్న ప్రతి కార్మికుడి ఆలోచన మాత్రం యాజమాన్యం ప్రతి ఒక్కరిపై ఏకాభిప్రాయం ఉంటుందని తప్పు చేసిన వ్యక్తిని తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని పలువురు కార్మికులు అనుకుంటున్నారు.