చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరం.
తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 7:
ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్ నమోదు కోసం రామగుండం ఐసీడీఎస్ కార్యాలయంలో రెండు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అక్టోబర్ 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న శిబిరం తొలిరోజు బుధవారం విజయవంతంగా కొనసాగింది. రామగుండం పరిధిలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు అక్టోబర్ 8న కూడా శిబిరానికి హాజరై తమ పిల్లల ఆధార్ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య తదితర అవసరాలకు ఆధార్ సేవలు అందుబాటులో ఉండేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.