చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరం.
చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరం.తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష.జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 7:ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్ నమోదు కోసం రామగుండం ఐసీడీఎస్ కార్యాలయంలో రెండు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అక్టోబర్ 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న శిబిరం తొలిరోజు బుధవారం విజయవంతంగా కొనసాగింది. రామగుండం పరిధిలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు అక్టోబర్ 8న కూడా శిబిరానికి హాజరై తమ పిల్లల ఆధార్ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు....