janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:13 pm Digital Edition : JANAM VOICE

ధర్మారం మోడల్ స్కూల్‌లో జూలై 3న స్పాట్ అడ్మిషన్లు.

ధర్మారం మోడల్ స్కూల్‌లో జూలై 3న స్పాట్ అడ్మిషన్లు.

జనం వాయిస్, ధర్మారం, జూలై 01:

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాల విభాగం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి జూలై 3న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల ఆవరణలో అడ్మిషన్లు చేపడతామని చెప్పారు. అర్హులైన విద్యార్థులు టీసీ, మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.