janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:05 pm Digital Edition : JANAM VOICE

మంథని లో శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ తాత్కాలికంగా సీజ్.

కుళ్ళిపోయినా వస్తువులు, పాడై పోయిన మసాలాలు.

మంథని లో శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ తాత్కాలికంగా సీజ్.

జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి.

జనం వాయిస్, మంథని, మే 29:

మంథని మార్కెట్ ప్రాంతంలో ఉన్న శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ & మెస్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. తనిఖీ సమయంలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపారు. రెస్టారెంట్‌ను గత ఏప్రిల్ నెలలోనే ఫుడ్ సేఫ్టీ అధికారిచే తనిఖీ చేసి అవసరమైన మార్పులు సూచించబడినప్పటికీ, ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీలో వంటగది పూర్తిగా అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు గుర్తించబడిందని, వంటగదిలో సరైన గాలి ప్రసరణ (వెంటిలేషన్) లేకపోవడం గమనించబడిందన్నారు.

వంట చేసే ప్రదేశం శుభ్రంగా లేకపోవడం గుర్తించబడిందని, వంటగది గోడలు, పైకప్పు మరియు ఎగ్జాస్ట్ ప్రాంతం మొత్తం ఆవిరై పేరుకుపోయిన నూనె మరియు మురికి పదార్థాలతో నిండిపోయి ఉన్నాయన్నారు. పాత మరియు పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బాలను కిరాణా సరుకులు మరియు మసాలా పదార్థాల నిల్వ కోసం మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారని, వంటగదిలోని డ్రైనేజ్ లైన్ దెబ్బతిన్న స్థితిలో ఉందని, ఆహార తయారీ కార్మికులు హెడ్ క్యాప్స్ మరియు గ్లవ్స్ ఉపయోగించకుండా పనిచేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అధిక పరిమాణంలో మసాలా పేస్టులు మరియు అల్లం-వెల్లుల్లి పేస్టులు తయారు చేసి ఫ్రీజర్‌లో సరైన నిర్వహణ లేకుండా నిల్వ చేశారని తెలిపారు. పై ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని, సంబంధిత రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని,  ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు అవసరమైన మార్పులు చేసిన తర్వాత మాత్రమే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వబడుతుందన్నారు. పై పేర్కొన్న రెస్టారెంట్‌తో పాటు మార్కెట్ ప్రాంతంలోని కిరాణా దుకాణాలను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేసి, ప్రయోగశాల విశ్లేషణ కోసం నమూనాలను సేకరించారు. ఈ తనిఖీని పెద్దపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి నిర్వహించారు.