janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 6:52 pm Digital Edition : GATTU MAHESH

ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా రాజశేఖర్.

ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా రాజశేఖర్.
-ప్రధాన కార్యదర్శి గా మడ్డి రాము.

జనం వాయిస్,మంథని,నవంబర్ 1:

ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా ములకల్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం మంథని పట్టణంలో ఎస్ టి యు టి ఎస్  మండల కౌన్సిల్ సమావేశం మండల శాఖ అధ్యక్షుడు ఈదులపల్లి నరసింహరావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్ టి యు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల శాఖ అధ్యక్షునిగా ములకల్ల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మడ్డి రాము,

ప్రధాన కార్యదర్శి మడ్డి రాము.

జిల్లా కౌన్సిలర్లు గా శేషాద్రి, భోగే చంద్రశేఖర్, కిన్నెర శ్రీనివాస్, బడుగు నరేష్ లు ఎన్నికయ్యారు.  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఓడ్నాల సహేందర్ ప్రకటించారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మాట్లాడుతూ…. ఉపాధ్యాయుల సమస్యలకు కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.