విద్యార్థి దశ నుండే దేశభక్తి అలవర్చుకోవాలి.
– పోతారం సర్పంచ్ ఎడ్ల ఆదిత్య.
జనం వాయిస్, మంథని, జనవరి 26:

విద్యార్థి దశ నుండే దేశభక్తి అలవర్చుకోవాలని పోతారం సర్పంచ్ ఎడ్ల ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం మంథని మండలం పోతారం గ్రామంలో సర్పంచ్ ఎడ్ల ఆదిత్య ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఆదిత్య జెండా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్పంచ్ ఆదిత్య బహుమతులు ప్రధానం చేశారు. తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశభక్తి ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి అలవర్చుకోవాలని, ప్రపంచ రాజ్యాంగాలలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దాసరి వెంకటస్వామి, పాలకవర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు