వరంగల్ ఎయిర్‌పోర్టుకు మంచి పేరు సూచించండి: ప్రజలను కోరిన సీఎం రేవంత్.
వరంగల్ ఎయిర్‌పోర్టుకు మంచి పేరు సూచించండి: ప్రజలను కోరిన సీఎం రేవంత్. ప్రాజెక్టును పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శ. భూసేకరణ కోసం రూ. 295 కోట్లు కేటాయించి, ఏఏఐకి భూమి అప్పగింత. మూడు ప్యాకేజీలుగా పనులు, డిసెంబర్‌లో శంకుస్థాపన చేసేందుకు ప్రణాళిక. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వరంగల్ (మామునూరు) విమానాశ్రయానికి సముచితమైన పేరును సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్'...