ఎండల ఎఫెక్ట్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి… ప్రజలు విలవిల!
ఎండల ఎఫెక్ట్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి… ప్రజలు విలవిల!జనం వాయిస్, తెలంగాణ, వెబ్ డెస్క్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగ్గుమంటూ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా సిద్దిపేట, మెదక్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, సూర్యాపేట,...