janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 9:49 pm Digital Edition : GATTU MAHESH

గోదావరిఖని ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా సురభి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక.

గోదావరిఖని ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా సురభి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక.

జనం వాయిస్, గోదావరిఖని :

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా సురభి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సర్వసభ్య సమావేశంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం ఎన్నుకున్నారు.దీనిలో భాగంగా సురభి శ్రీధర్ ను ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం సురభి శ్రీధర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో క్లబ్ జాయింట్ సెక్రెటరీగా ఎన్నుకున్నందుకు అధ్యక్షుడు మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యాం కుమార్ తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.సురభి శ్రీధర్ ఎన్నిక పట్ల పాత్రికేయులతో పాటు పలువురు హర్ష వ్యక్తం చేశారు.