టీ 20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల!
జనం వాయిస్, స్పోర్ట్స్:
వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఐసీసీ మంగళవారం ప్రకటించింది.ఈ టోర్నికి భారత్,శ్రీలంక,సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది.గుజరాత్‌లోని అహ్మదా బాద్ స్టేడియంలో ఫైనల్‌మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరితే కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి శ్రీలంకలోని మూడు వేదికల్లో క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో జరగనున్నాయి ఈ మెగా టోర్నమెంట్.