ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.
జనం వాయిస్, ముత్తారం:
ఏప్రిల్ 3,4వ తేదీలలో ముత్తారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.