janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 1:10 am Digital Edition : GATTU MAHESH

సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.

సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.
– నియతి ఆయోగ్ తాజా నివేదిక

జనం వాయిస్,హైదరాబాద్‌,అక్టోబర్‌ 31:

తెలంగాణ రాష్ట్రం మరోసారి జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. 2025 అక్టోబర్‌లో విడుదలైన నియతి ఆయోగ్ (NITI Aayog) తాజా నివేదిక ప్రకారం, 2014 నుండి 2023-24 వరకు దేశంలో సేవల రంగంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణగా నిలిచింది.
రాష్ట్ర స్థూల విలువ (GSVA)లో సేవల రంగం వాటా 9.6% పెరుగుదల నమోదు చేసింది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా 2011-12లో 52.8% ఉండగా,2023-24 నాటికి 62.4% కు పెరిగింది. దశాబ్ద కాలంలో సగటు వాటా 60.3%గా నమోదైంది.భారతరాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నేతృత్వంలోని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, సమాచార సాంకేతికత ఆధారిత ఆర్థిక విధానాలు ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని నివేదిక పేర్కొంది.టి-హబ్‌, టి-వర్క్స్‌, వీ-హబ్‌, ఇమేజ్‌ వంటి సృజనాత్మక సంస్థలను ఏర్పాటు చేసి, స్టార్టప్‌లు మరియు టెక్నాలజీ రంగ అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ సమగ్ర వృద్ధి ఎకోసిస్టమ్‌ తెలంగాణను దేశంలో సేవల రంగానికి హబ్‌గా మార్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు.మేము తెలంగాణను ప్రతి ఒక్కరికి గర్వకారణంగా నిలిచే రాష్ట్రంగా తీర్చిదిద్దాం. దృఢమైన విధానాలు, దూరదృష్టి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే వృద్ధి సాధ్యమవుతుంది,” అని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు.