సింగరేణి కార్మికుల ‘సొంతింటి’ కలకు అసెంబ్లీ వేదికగా అడుగు.

సింగరేణి కార్మికుల ‘సొంతింటి’ కలకు అసెంబ్లీ వేదికగా అడుగు.• కార్మికుల డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించనున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్.• చొరవను స్వాగతించిన సీఐటీయూ.• ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు: తుమ్మల రాజారెడ్డి.జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 15:సింగరేణి కార్మికుల దశాబ్దాల స్వప్నమైన ‘సొంతింటి సహకారం’ పథకానికి అసెంబ్లీ వేదికగా మరోసారి బలమైన ప్రస్తావన రానుంది. కార్మికుల సమస్యను శాసనసభలో ప్రస్తావించేందుకు ముందుకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు....