janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:04 pm Digital Edition : JANAM VOICE

హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతం.

హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతం.

– బంద్‌కు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు.

– డంపింగ్ యార్డ్ ఏర్పాటు వెంటనే ఉపసంహరించుకోవాలి.

– హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

జనం వాయిస్, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి మరియు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. హుజురాబాద్ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దేశానికి నాణ్యమైన విత్తనాలను అందించే ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదననుఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ నెల 7, 8 తేదీల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో రెండు రోజుల పాటు పాల్గొంటానని తెలిపారు. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.