గజ గజా వణికిస్తున్న చలి.. రానున్న రెండ్రోజులు నరకమే, హెచ్చరికలు జారీ.

గజ గజా వణికిస్తున్న చలి.. రానున్న రెండ్రోజులు నరకమే, హెచ్చరికలు జారీ. జనం వాయిస్, వెబ్ డెస్క్:_తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.__ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత భీభత్సంగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య...