ధరల మంటలో సామాన్యుడి బతుకు బుగ్గి!
ధరల మంటలో సామాన్యుడి బతుకు బుగ్గి! పండుగ వేళ నిత్యావసరాల ధరలతో జనం విలవిల!. బియ్యం, పప్పులు, కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. నెలవారీ కుటుంబ బడ్జెట్పై అదనంగా రూ.2,500 భారం. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల అదనపు ఛార్జీలతో ప్రయాణికులపై మోత. ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న వినియోగదారులు. జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 16:పండుగ వచ్చిందంటే ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపాల్సిన వేళ.. నిత్యావసరాల ధరలు సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటేనే మధ్యతరగతి కుటుంబాలు జంకుతున్నాయి. బియ్యం కొనాలన్నా భారం.. పప్పులు...