ఎదిగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్ పాలన.
– ఆకాశమే హద్దుగా బీఆర్‌ఎస్ పార్టీ ఎదుగాలి.
– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జనం వాయిస్, మంథని:
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో ఎదిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలన వెనక్కిపడేసిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని రాజగృహాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులు ఎగురవేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోందని, చలి కాలం నుంచి ఎండకాలంకు ఆహ్వనించే సందేశంగా పతంగులను ఎగురవేయడం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆకాశమే హద్దుగా ఎదుగాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. అలాగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్ పాలనను అంతమొందించే దిశగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పతంగుల్లా ఎగురాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.