డబ్బుల కోసం పసికందును అమ్మేసిన దంపతులు.
డబ్బుల కోసం పసికందును అమ్మేసిన దంపతులు. వారం రోజుల శిశువు విక్రయం. అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతతో బయటపడిన ఘటన. రూ.1.7 లక్షలకు శిశువును విక్రయించినట్లు అంగీకారం. జనం వాయిస్, మెదక్, మార్చి 10: మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్ముకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించి మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో జరిగింది. ఈ సంఘటన బయటపడటంతో స్థానిక...