janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 5:19 pm Digital Edition : JANAM VOICE

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగింపు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగింపు.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులకు రేపటితో గడువు ముగియనుంది. రూ. 3,000 ఆలస్య రుసుముతో మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ పొడిగింపు ఫస్ట్‌, సెకండ్‌ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి మే 25 వరకు జరుగుతాయి. ఇంగ్లిష్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు కూడా ఆయా తేదీల్లో నిర్వహించనున్నారు.