janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 12:54 pm Digital Edition : JANAM VOICE

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్  మొదటి రోజు పరీక్ష ప్రశాంతం.

  • పెద్దపల్లి జిల్లాలో ఇంటర్  మొదటి రోజు పరీక్ష ప్రశాంతం.
  • -ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన.
  • -ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు /ఉర్దూ/హిందీ పరీక్షకు (97%) మంది విద్యార్థులు హాజరు.
  • జనం వాయిస్, పెద్దపల్లి, ఫిబ్రవరి-25:
  • పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం  పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు,  హిందీ, ఉర్దూ  భాష పరీక్షలు జరిగాయని,  ఈ  పరీక్షకు (5419) మంది హాజరు కావాల్సి ఉండగా, (5271)మంది హాజరు కాగా,(148) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, తొలి రోజు 97 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని, మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.