janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 3:31 pm Digital Edition : JANAM VOICE

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
– మంథనిలో టి ఫైబర్ సమ్మర్ క్యాంపును పరిశీలించిన మంత్రి.

జనం వాయిస్, మంథని, మే 01:

విద్యార్థులకు ఆదునాతనమైన సాంకేతికపరమైన విద్యను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, సూపర్ సమ్మర్ సమ్మర్ క్యాంపులను టీ ఫైబర్ ద్వారా ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంపు ను మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చిన్న వయసు నుండే విద్యార్థులు తమ సృజనాత్మకతను పెంచుకోవాలని ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఏఐ, రోబోటిక్ లాంటి వాటిపైన అవగాహనా కలిగి ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఐ ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ప్రపంచం స్థాయిలో గొప్ప ఇంజనీర్లుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోబోటిక్ ద్వారా మూన్ ల్యాండింగ్ అనే ప్రక్రియ ఇక్కడి మంథని మారుముల ప్రాంత విద్యార్థులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న ప్రయివేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు.ఈ సమ్మర్ క్యాంపు లకు విద్యార్థుల తల్లితండ్రులు సహకరించడం సంతోషంగా ఉందన్నారు.