శ్రీశైలంలో హుండీల ఆదాయం రూ.4.89 కోట్లు.
శ్రీశైలంలో హుండీల ఆదాయం రూ.4.89 కోట్లు.-భారీగా లభించిన విదేశీ కరెన్సీలు.జనం వాయిస్, శ్రీశైలం, డిసెంబర్ 22: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన హుండీల లెక్కింపులో దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741 నగదు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. ఈ మొత్తాన్ని భక్తులు గత 27 రోజుల కాలంలో, అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకలుగా తెలిపారు. హుండీల్లో దేశీయ కరెన్సీతో పాటు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీలు...