భూమికి దూరమవుతున్న చంద్రుడు.
భూమికి దూరమవుతున్న చంద్రుడు. ఏటా 3.83 సెంటీమీటర్లు పెరుగుతున్న దూరం. భవిష్యత్తులో రోజు నిడివి పెరిగే అవకాశం. సంపూర్ణ సూర్యగ్రహణాలు కనుమరుగయ్యే సూచనలు. జనం వాయిస్, న్యూఢిల్లీ, జూలై 23: భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.83 సెంటీమీటర్ల వేగంతో భూమికి దూరమవుతున్నాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేగం మనిషి గోర్లు పెరిగే వేగంతో సమానమే అయినప్పటికీ, కోట్లాది సంవత్సరాల కాలంలో ఇది భూమిపై గణనీయమైన మార్పులకు దారితీసే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ మార్పు చాలా నెమ్మదిగా...