janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 8:54 pm Digital Edition : GATTU MAHESH

బయటపడ్డ అమ్మవారి విగ్రహం..ప్రత్యేక పూజలు.

బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు.

జనం వాయిస్, మంచిర్యాల, డిసెంబర్ 15:

మంచిర్యాల జిల్లా ముల్కల మండలం నేలమాలిగలో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు పోటెత్తారు. అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలు క్యూ లైన్ పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఒకానొక సమయంలో ప్రజలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం పూజారీతోపాటు పలువురు పీఠాధిపతులు స్వామీజీలు గోదావరి పరిక్రమ యాత్ర చేపట్టారు. డిసెంబర్ 12వ తేదీన ఈ యాత్ర.. మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ముల్కల మండలం నేలమాళిగలో గోదావరి నది పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గంలో ప్రదేశాన్ని చూపించి.. ఈ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి ఉందని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.స్థల యజమాని అనుమతితో స్థానికులు.. ఆ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయటపడింది. దీంతో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో అమ్మ వారి విగ్రహం బయటపడడం తమ అదృష్టమని గ్రామస్తులు ఈ సందర్భంగా వెల్లడించారు..