జాతీయ గేయం ప్రారంభించిన గ్రామ సర్పంచ్.
– జాతీయ గేయం రచించబడి సార్ధ శతం (150) సంవత్సరాలు.
– ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్ రావు.
జనం వాయిస్, ముత్తారం:
జాతీయ గేయం రచించబడి సార్ధ శతం (150) ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముత్తారం గ్రామపంచాయతీలో సర్పంచ్ సుధాటి రవీందర్ రావు 77వ గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగరవేసి,జాతీయ గేయాన్ని ప్రారంభించి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చౌరస్తాల వద్ద విద్యుస్తంభాలకు లౌడ్ స్పీకర్లు అమర్చమని తెలిపారు.ప్రతిరోజు ఉదయం 8 గంటల 40 నిమిషాలకు జాతీయ గేయం ప్రారంభించబడుతుందని గ్రామంలోని ప్రజలు,రైతులు,వ్యాపారులు, ప్రయాణికులు ఎక్కడి వాళ్ళ అక్కడ నిలబడి జాతీయ గేయాన్ని ఆలపించి,గౌరవ వందనం చేయాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత,వార్డు సభ్యులు,కార్యదర్శి నరేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.