మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం.
-రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
-మంథని లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
జనం వాయిస్, మంథని:
మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజలందరి ప్రోత్బలంతో, పట్టణ ప్రజలందరి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఉపాధి కల్పియాలే అనే ఉద్దేశ్యంతో ఏటిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేము గెలవగానే దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేసి పనులన్నీ పూర్తి చేశామని, ఈ రోజు మరొక్క సారి ఇంకా పూర్తికాని పనులకు సంబంధించి, అన్ని కులాల వర్గాలకు సంబందించిన కమ్యూనిటీ భవనాల కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలోని గ్రామ దేవతలకు సంబంధించి చిన్నగా ఉన్న ఆలయాల అభివృద్ధి కి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.మా లక్ష్యం మార్పు చూపించడమే నని ఇంకా రాబోయే మూడు సంవత్సరాల్లో అనేక రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల అభివృద్ధికి పాటుపడుతామని తెలిపారు.