janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 2:29 pm Digital Edition : JANAM VOICE

దొంగలు బాబోయ్ దొంగలు..

దొంగలు బాబోయ్ దొంగలు..

– హుజరాబాద్ లో మాయం అవుతున్న వాహనాలు.

జనం వాయిస్, హుజూరాబాద్:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గడిచిన వారం రోజులుగా ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇటీవల (స్ప్లెండర్ బైక్ లు).. ఎత్తుకెళ్లిన దొంగలు హల్చల్ చేస్తున్నారు..ఇంటి ముందర పార్కింగ్ చేసిన వాహనాలను అలాఓకగా తీసుకెళ్తూ విద్యానగర్ లోని సీసీటీవీ కెమెరాలో కూడా చిక్కారు. అయితే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడంతో.. ఇదే అదనుగా భావించి బైక్లను ఎత్తుకెళ్తున్నారు.. ఇప్పటికే హుజురాబాద్ పట్టణంలో  పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను దొంగలు చోరీకి పాల్పడుతుండడంతో  హుజురాబాద్ ప్రాంత వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు.పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను ఆరికట్టించాల్సిందిగా పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.