janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 8:24 pm Digital Edition : GATTU MAHESH

అకారణంగా చేయి చేసుకున్న సిఐ పై చర్యలు తీసుకోవాలి.

అకారణంగా చేయి చేసుకున్న సిఐ పై చర్యలు తీసుకోవాలి.

-మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్.

జనం వాయిస్,మంథని, డిసెంబర్ 12 :

తనపై అకారణంగా చేయి చేసుకున్న మంథని సిఐ  రాజు పై చర్య తీసుకోవాలని  లక్కేపూర్ మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్  అన్నారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై కూర కోటేష్  తన అనుచరులతో దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  ఎలాంటి విచారణ చేయకుండా  మంథని సిఐ రాజు  కూర కోటేష్ చెప్పిన  మాటలు విని మా గ్రామం తోట గోపయ్య పల్లెకు వచ్చి  గ్రామస్తుల అందరి ముందు దుర్భాషలాడుతూ  నాపై నా కుమారుడిపై గ్రామస్తులు చూస్తుండగానే చేయి చేసుకున్నాడనీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన గొడవపై ఎలాంటి విచారణ జరపకుండా  నిజా నిజాలు ఏమిటో తెలుసుకోకుండా  రౌడీ  షీటర్ అయిన కూర కోటేష్ కు అనుకూలంగా వ్యవహరించారని  పర్వతాలు యాదవ్ ఆరోపించారు.   నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో  పలుమార్లు ఎంపీటీసీగా గ్రామ సర్పంచ్ గా ఎన్నికై  లక్కెపూర్ గ్రామానికి  ఎంతో సేవ చేశానని ఈరోజు వరకు చుట్టుపక్క గ్రామాల్లో నాకున్న మంచి పేరు నా రాజకీయ ఎదుగుదలను మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో ముందుకెళ్లుతున్న తరుణంలో  అది చూసి ఓర్వలేక రౌడీ షీటర్  కూర కోటేష్ నన్ను అంతమొందించేందుకు  రెక్కి నిర్వహించి  నేను తోటగోపయ్యపల్లకి వెళుతుండగా  మార్గం మధ్యలో కారు అడ్డంపెట్టి నన్ను అంతమొందించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికైనా పోలీసులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరగకుంటే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఈ సందర్భంగా లెక్కేపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ పర్వతాలు యాదవ్ మా లక్కేపూర్  గ్రామానికి ప్రచారానికి రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్ లో 
ప్రచారం కోసం మా  గ్రామానికి  పర్వతాలు యాదవ్ రాలేదని లక్కేపూర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పర్వతాలు మద్దతుగా వచ్చి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్,  మైనార్టీ నాయకుడు ఎండి సల్మాన్, దూడపాక రాజయ్య, మంథని మల్లయ్య, నాంపల్లి బాలయ్య,  మిట్ట రాజయ్య, తొగరి రాజీర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.