janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 3:18 pm Digital Edition : GATTU MAHESH

భూపాలపల్లి జిల్లాలో ఎద్దు పై పులి దాడి.

భూపాలపల్లి జిల్లాలో ఎద్దు పై పులి దాడి.

జనం వాయిస్, భూపాలపల్లి:

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపు తున్నది. ఇటీవల కాలంలో పెద్దపులి పశువులఫై దాడి చేసి చంపిన దాఖలాలు ఉన్నాయి.. మళ్లీ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరించడంతో రైతులు భయాందోళకు గురవుతున్నారు.భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయమే ఒక ఎద్దు పై పులి దాడి చేసి చంపేసినట్లు పులి అడు గుల ద్వారా గ్రామస్తులు గుర్తించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నా రు.గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలైన జడల్ పేట్, గాంధీనగర్,భీష్మ నగర్, రామచంద్రపూర్, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కోరారు. చేను, పొలాలు,వ్యవసాయ బావుల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.