janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 7:13 pm Digital Edition : GATTU MAHESH

గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచారం.

గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచారం.

జనం వాయిస్, గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు.ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది ఇసుక,లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్టు అడుగులను అధికారులు నిర్ధారించారు.దీంతో పులి సంచరించిన ప్రాంతాలను ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఆదిలాబాద్ తడోబా అడవుల నుంచి గత వారం రోజుల నుంచి పెద్దపులి, మంచిర్యాల మీదుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆ తర్వాత పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి వెళ్లే అవకాశం ఉందని జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య పేర్కొన్నారు.అయితే ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.గ్రామస్థులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని ఆయన పేర్కొన్నారు.