పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పులి సంచారం..
జనం వాయిస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం వెంకటాపూర్, ఆరెంద, అడవి ప్రాంతంలో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం ఆరెంద అటవీ ప్రాంతం నుండి మానేరు గుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గోదావరి నది తీరంలోని ఖానాపూర్, ఎగ్లాస్పూర్, ఖాన్ సాయి పేట్, ఆరెంద,మల్లారం, స్వర్ణ పల్లి, అడవి సోమనపల్లి, కాలేశ్వరం, దామరకుంట, ప్రజలు, రైతులు, పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని, ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య పేర్కొన్నారు. పులికి హాని కలిగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.