janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 4:04 pm Digital Edition : JANAM VOICE

జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం.

జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

కాంగ్రెస్ పార్టీకి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రిపై విమర్శలు జీవన్ రెడ్డికి సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పద్ధతికి తాము వ్యతిరేకమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే హరీశ్ రావు చూపించాలని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.