జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం.
జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం. జనం వాయిస్, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రిపై విమర్శలు జీవన్ రెడ్డికి సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పద్ధతికి తాము వ్యతిరేకమని మహేశ్...