గంగాపురి సమీపంలో ట్రాక్టర్ బోల్తా.!
-మానవత్వం చాటుకున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు.
జనం వాయిస్, మంథని:
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు మరోసారి తన మానవాత్వన్ని చాటుకున్నారు. మంథని నుంచి సిద్ధపల్లి వైపు సిమెంట్ బ్రిక్స్ లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో అదే మార్గంలో వెళ్తున్న టీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు వెంటనే స్పందించారు. మంథని సీఐ రాజు తన సిబ్బందితో కలిసి జేసిబి ని తెప్పించి, ట్రాక్టర్ కింద ఇరుక్కున్న లేబర్‌ను క్షేమంగా బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా మంథని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడి, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని శ్రీను బాబు కోరారు.