janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 1:30 pm Digital Edition : GATTU MAHESH

ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్.!

ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్.!

జనం వాయిస్, తెలంగాణ,డిసెంబర్ 03:

మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? ఆ మొత్తాన్ని చెల్లించడానికి రాయితీ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే.. ఇది మీకు నిజంగా శుభవార్త. డిసెంబర్ రెండో వారంలో.. సరిగ్గా డిసెంబర్ 13న జరగబోయే దేశవ్యాప్త లోక్ అదాలత్‌లో మీ పాత ట్రాఫిక్ చలాన్లను 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీతో (డిస్కౌంట్‌తో) క్లియర్ చేసుకునే అద్భుత అవకాశం లభించింది.ఈ లోక్ అదాలత్ ద్వారా చలాన్‌లను సెటిల్ చేసుకోవడం వలన.. మీపై ఉన్న కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది. భవిష్యత్తులో మళ్లీ ఆ చలాన్లకు సంబంధించి కోర్టు విచారణ ఉండదు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పర్య వేక్షణలో ఈ లోక్ అదాలత్‌ లను నిర్వహిస్తారు. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇక్కడ పరిష్కరిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా భాగమవుతోంది.

*రాయితీకి అర్హత ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు..*

చిన్నపాటి ఉల్లంఘనలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత ఈ-చలాన్లను ఈ లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం,
రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, సాధారణ ఓవర్ స్పీడింగ్ కేసులు, రాంగ్ పార్కింగ్ ఉల్లంఘనలు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విధించిన చలాన్లు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల విధించిన చలాన్లు,
నంబర్ ప్లేట్ లేకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లోపాలు, ఇతర పొరపాట్లతో తప్పుగా నమోదైన చలాన్లు.. ఇన్నీ ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.అధికారులు స్పష్టం చేసిన దాని ప్రకారం.. ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులకు ఈ రాయితీ వర్తించదన్నారు. దీనిలో.. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), హిట్ అండ్ రన్ కేసులు, ప్రమాదకర డ్రైవింగ్, గాయాలు లేదా మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు ఉన్నాయి.