janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 2:21 pm Digital Edition : JANAM VOICE

కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాదం.

కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాదం.

వడ దెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి.

జనం వాయిస్, కాళేశ్వరం, మే 23:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బతో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే… కాళేశ్వరంలోని ఇప్పల్ బోరు సమీపంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని 108 వాహనంలో తరలించి పరీక్షించగా… అప్పటికే వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి వివరాలు వెల్లడించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతని గురించి సమాచారం తెలిసిన వారు 8712658115 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.